హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్.. రికార్డు స్థాయిలో పెరిగిన అద్దెలు
- తొలి త్రైమాసికంలో 31.5 లక్షల చ.అ. ఆఫీస్ స్థలం లీజింగ్
- గతేడాదితో పోలిస్తే 21.6 శాతం వృద్ధి నమోదు
- మొత్తం లీజింగ్‌లో మాదాపూర్ వాటానే 91 శాతం
- కొత్త సరఫరా లేకపోవడంతో తగ్గిన ఖాళీలు.. పెరిగిన అద్దెలు
- ఐటీ-బీపీఎం, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌ల నుంచే అధిక డిమాండ్
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఆఫీస్ స్థలాల లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి. ఈ మూడు నెలల్లో ఏకంగా 31.5 లక్షల చదరపు అడుగుల (ఎంఎస్ఎఫ్) స్థలం లీజుకు వెళ్లింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 21.6 శాతం అధికం. ప్రముఖ వాణిజ్య రియల్ ఎస్టేట్ సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఆఫీస్ లీజింగ్ (సుమారు 2.2 కోట్ల చ.అ.)లో హైదరాబాద్ వాటానే 14 శాతంగా ఉండటం నగర ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
ఈ త్రైమాసికంలో జరిగిన లావాదేవీల్లో సింహభాగం భారీ ఒప్పందాలే కావడం గమనార్హం. లక్ష చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న డీల్స్ మొత్తం లీజింగ్‌లో 81 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మొత్తం కార్యకలాపాల్లో అత్యధికంగా 91 శాతం లీజింగ్ ఒక్క మాదాపూర్‌లోనే జరగడం ఆ ప్రాంత ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ క్వార్టర్లో నగరంలో కొత్తగా ఆఫీస్ భవనాల నిర్మాణం పూర్తి కానప్పటికీ, డిమాండ్ మాత్రం బలంగా కొనసాగింది. ఫలితంగా నికరంగా 22.1 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగంలోకి వచ్చింది. దీంతో నగరవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆఫీస్ స్థలాల శాతం 20.22 శాతానికి తగ్గింది. ముఖ్యంగా మాదాపూర్‌లో ఖాళీలు కేవలం 7.5 శాతానికే పరిమితం కాగా, అక్కడి ఏ-గ్రేడ్ భవనాల్లో ఇది అత్యంత తక్కువగా 4.8 శాతంగా నమోదైంది.
పెరిగిన డిమాండ్, తగ్గిన ఖాళీల ప్రభావంతో నగరంలో ఆఫీస్ అద్దెలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. సగటున చదరపు అడుగు అద్దె గతేడాదితో పోలిస్తే 11.6 శాతం పెరిగి రూ. 92.2కు చేరింది. మాదాపూర్‌లో ఇది గరిష్ఠంగా రూ. 105.5గా ఉండగా, గచ్చిబౌలిలో కాస్త తక్కువగా రూ. 72.3గా ఉంది. ఐటీ-బీపీఎం రంగం 36 శాతంతో లీజింగ్‌లో అగ్రస్థానంలో నిలవగా, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ (30 శాతం), బీఎఫ్ఎస్ఐ (23 శాతం) రంగాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ఈ వృద్ధికి మరింత ఊతమిచ్చింది.